తెలుగు స్త్రీవాద కవిత్వంలో మందరపు హైమవతి తన ప్రత్యేక స్వరంతో స్త్రీల ఆర్తిని,ఆవేశాన్ని ,ఆగ్రహాన్ని ప్రేమను ప్రేమ రాహిత్యా జీవన వేదననూ ఆర్థిక సంబంధాల ప్రభావంతో చిద్రమవుతున్న స్త్రీ పురుష సంబంధాలను అపురూపంగా చిత్రించింది ఈ నీలి గోరింట కవిత సంకలనంలో 57 కవితలున్నాయి.బాధలు పాతవే కానీ గాయాలు కొత్తవి అంటూ హైమవతి మారుతున్న కాలంలో మారే అణచివేతల రూపాలను ,హింసా రూపాలను ఒకొక్కటిగా పరిచయం చేసింది ఈ నీలి గోరింట సంకలనంలో స్త్రీలు అనుభవిస్తున్న సమస్య వివక్షతలూ కనిపిస్తాయి,హెచ్చరిస్తాయి, ఆలోచించమంటాయి.వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9441062732.

Leave a comment