వెండి కానీ వెండి ఇది. ఎప్పటికి మాసిపోని మెరుపుతో తక్కువ ధరతో ఈ జర్మన్ సిల్వర్ ఆ భరణాలు అన్ని రకాల డిజైన్ లలో అందుబాటులోకి వచ్చాయి . ముఖ్యంగా ఆభరణాల్లో  బాజు బంద్ వెరైటీని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మోచేతి పై భాగం లో ధరించే ఈ వంకి అందానికే  కాదు ఆరోగ్యానికి మంచిదే . జర్మన్ సిల్వర్ బంగారం రంగు పులుముకొని రంగుల రాళ్ళు జతకలుపుకొని అందమైన ఆభరణాలు తయారవుతున్నాయి ఈ మధ్య కాలంలో ప్రతి సెలబ్రేషన్ లోను ఈ జర్మన్ సిల్వర్ తో చేసిన ఐస్ క్రీమ్ బౌల్స్,తులసి కోటలు ,కుంకుమ భరణేలు రిటుర్న్ గిఫ్ట్ లాగా ఇస్తున్నారు. బంగారం రంగు అద్దుకొని జర్మన్ సిల్వర్ కాస్త జర్మన్ గోల్డ్ అయింది కిలో వెండి నలభైవేలు చేస్తే ఈ వెండి కానీ వెండి వెయ్యి రూపాయలే. అలచౌక్ అయిన ఈ జర్మన్ సిల్వర్ ఆభరణాలు ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయాయి.

Leave a comment