ఈ సీజన్ సన్నగా వర్షం పడుతూ వాతావరణం చల్లగానే ఉంటుంది. కానీ జలుబు ,శ్వాసకోశ ఇబ్బంది విసిగిస్తాయి. దీనికో తియ్యని చికిత్స ఉంది. ఓ గ్లాస్ పాలలో కొన్ని కిస్మిస్ లు కలిపి తీసుకొంటే ఈ సమస్య నుంచి ఉపశమనం అంటున్నాయి. ఈ కిస్మిస్ పండ్లు ప్రతి రోజు తింటే శరీరంలో పులుపు స్వీకరించే శక్తిగల ఆమ్లాలు సమతుల్యం అవుతాయి. జ్వరం రాకుండా ఉంటుంది. కొన్ని కిస్మిస్ పండ్లు నీటిలో నాననిచ్చి తింటే నరాలకు బలం వస్తుంది. వీటిలో ఐరన్ చాలా ఎక్కువ. ఇది రక్తహీణతను తగ్గిస్తుంది.

Leave a comment