కరోనా ఎందరో జీవితాలను తలక్రిందులు చేస్తోంది బ్రతుకు పోరాటం కోసం ఎంత సాహసానికైనా దిగుతున్నారు ఢిల్లీకి చెందిన చాంద్ మొహమ్మద్ పన్నెండవ తరగతి విద్యార్థి ముగ్గురు అక్క చెల్లెలు ఇద్దరు అన్నదమ్ములు తల్లిదండ్రులు అందరూ ఇంట్లోనే కూర్చునే పరిస్థితి ఎక్కడ ఎవరికీ పనులు లేవు ఈ పరిస్థితుల్లో చాంద్ లోక్ నాయక్ నారాయణ్ ఆస్పత్రుల్లో ఒక ఉద్యోగం సంపాదించాడు చనిపోయిన కరోనా పేషెంట్ దహనం చేసే ఉద్యోగం అతనితోపాటు ఇంకో స్వీపర్ ప్రతి రోజు చనిపోయిన కరోనా పేషెంట్లను అంబులెన్స్ ఎక్కించి స్మశానానికి తీసుకుపోయి తగలబెట్టాలి .రోజుకు రెండు మూడు శవాలను తగలబెడుతున్నారు చాంద్ ఎనిమిది గంటల ఉద్యోగంలో పి పి ఈ కిట్ ధరించే ఉంటాడు అతనికి 17 వేలు .దీనితో ఇంట్లో వాళ్ళ ఆకలి బాధ అయినా తీరుతోంది అంటున్నాడు చాంద్.

Leave a comment