నగల కంటే ఇవే అందం

ఫ్యాన్సీ జ్యువెలరీ ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. ఆక్సిడైజ్డ్ వెండి జ్యువెలరీ అయితే మోడరన్ డ్రెస్ లపైకి ఎంతో బావుంటాయి. ఎన్నో రకాల అందమైన గవ్వలు ధ్రెడ్ ,జ్యువెలరీ ఇలా అన్ని ఫ్యాషన్ ఐకాన్స్ . అయితే ఈ ఫ్యాన్సీ జ్యువెలరీ ఖరీదు తక్కువే కదా అని ఎక్కడ తీస్తే అక్కడ వదిలేస్తే ఒక్క జతలో ఒక్కటి కనబడకుండాపోయి ఆసెట్ అవతలపడేయవలసి వస్తుంది. ఇలాంటివి ఏ గది మూలనో అలంకరణ సామాగ్రిలాగా అనిపించే ఆర్గనైజర్స్ కి తగిలిస్తే వస్తువు పాడై పోకుండా ఒక దానితో ఒకటి ముడిపడి చిక్కులు పడకుండా అందుబాటులో ఉంటాయి ఈ హోమ్ క్రాఫైడ్ జ్యువెలరీ ఆర్గనైజర్స్ ని చూస్తే ఇంట్లో సొంతగా చేసుకోనే కొన్ని ఐడియాలు కూడా రావచ్చు.