ముక్కుపుడక ఫ్యాషన్

ఏ వయసు వాళ్ళకైనా ముక్కుపుడకలు బావుంటాయి. ఇప్పటికి ఫ్యాషన్ ట్రెండ్ కూడా. ముక్కు రంద్రం చేయించుకోవచ్చు, లేదా ప్రెస్ చేసేవి కూడా వున్నాయి ప్లాటినమ్ వంటి వజ్రంలో చేసేవి టీనేజర్లకు బావుంటాయి లేదా రెండు మూడు గ్రాముల బరువుతో రాళ్ళూ పొదిగిన వేలాడే మువ్వలు ఉండే ముక్కుపుడక కూడా బావుంటుంది. మరి పెద్ద ముక్కుపుడకలు రోజు పెట్టుకునేందుకు అనువుగా ఉండవు గాని ధరించేందుకు వీలుగా వుండే పూవులు లతల డిజైన్ల వి చిన్నవిగా వుండేవి ఎంచుకుంటే బావుంటుంది. రోజు గోల్డ్ లో వజ్రాలు పొదిగినవి ఇంకా చక్కగా ఉన్నాయి. కెంపులు కూడా చాలా అందంగా వుంటాయి.