ముప్పై ఏళ్ళు దాటుతుంటే చర్మంలో మార్పులు మొదలవుతాయి . వయసు ప్రభావం చర్మం పైన కనిపిస్తుంది . ఇది అందరిలో ఒకేలా కనిపించరు . ముఖ చర్మంలో అయినా ఇతర భాగాలలో అయినా చర్మం యొక్క ఆరోగ్యానికి చర్మకణాల నిర్మాణం లోని రెండు ముఖ్యమైన ప్రోటీన్లు అవికొల్లా జన్ ,ఇలాస్టిక్ . ఈ రెండు ప్రొటీన్ల వల్లనే చర్మం ఆరోగ్యంతో మెరుస్తుంది . వయసు పెరుగుతున్న కొద్దీ ఈ రెండు ప్రోటీన్లు తగ్గుతాయి . ఈ చర్మంలో వెలుగు,బిగుతు తగ్గుతాయి . ఈ వయసులో వచ్చే మార్పులు నిరోదించాలంటే ప్రకృతి సహజంగా లభించే పదార్దాలు వాడచ్చు . ఉదాహరణకు ఆలివ్ నూనె ,చర్మంపైన ముడతలు రానివ్వదు . చర్మానికి మేలుచేసే విటమిన్ లు ,లవణాలు ఫ్యాటీ ఆమ్లాలు ఇందులో ఉన్నాయి . మొహం శుభ్రంగా సబ్బుతో కడిగి అరచేతిలో నాలుగైదు చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి మొహం, మెడ భాగాలను మర్దన చేయాలి . రాత్రివేళ ఈ ఆయిల్ రాసుకొని ఉదయం లేచాక కడిగేసుకొంటే సరి . ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది .

Leave a comment