మూడింటినీ ఒకే సారి

ఆస్ట్రేలియాలో జరిగిన ట్రయాథాన్ లో చక్కని ప్రతిభ ప్రదర్శించిన 16 గంటల ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకొని ఐరన్ మ్యాన్ టైటిల్ గెల్చుకొన్నది నాసిక్ కు చెందిన రవిజ సింఘాల్. 19 సంవత్పరాలకే ఈ ఘనతను సాధించిన పిన్నవయస్కురాలిగా రవిజకు గుర్తింపు దక్కింది. ఆమె తండ్రి రవీందర్ కుమార్ సింఘల్ నాసిక్ పోలీస్ కమీషనర్ . ఆస్ట్రేలియాలోని బస్సేల్టన్ లో జరిగిన ఈ పోటీల్లో ఆ దేశంతో పాటు భారత్, చైనా,జపాన్,ప్రాన్స్ ,ఇంగ్లండ్ కు చెందిన పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. వ్యాయమాలు ,పోషకాహారంపై దృస్టిపెట్టి చక్కని ఫిట్ నెస్ సాధించి ఈత రన్నింగ్ ,సైక్లింగ్ కలిసిన ట్రాయ్ థాన్ లో టైటిల్ గెలుచుకొన్న రవిజ సింఘాల్ ప్రస్తుతం ఇంటర్ చదవుతోంది.