చర్మంలో కొల్లాజెన్ ,ఎలాస్టిన్ వంటి ప్రోటీన్ల విడుదల తగ్గిపోవడంతో చర్మం ముడతలు పడిపోతూ ఉంటుంది.వయసుతో పాటు కళ్ళ కింద కూడా ముడతలు వచ్చేస్తాయి.వాటితో పాటు వాతావరణ కాలుష్యం డి హైడ్రేషన్ చర్మం విడుగలయ్యే టాక్సిన్లు కూడా చర్మాన్ని ముడతలు పడేలా చేస్తాయి.కాస్త శ్రద్దతో చర్మాన్ని కాపడుకోవచ్చు. 30 ఏళ్ళు దాటక సన్ స్క్రిన్ తప్పనిసరిగా వాడాలి. ఇది చర్మాన్ని ముడతలు పడనివ్వదు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే చర్రీలు,ద్రాక్ష,పాలకూర వంటివి ఎఖ్కువ తీసుకోవాలి.తీపి పదార్ధాలు మిఠాయిలు వాటిలోని చెఖ్కర చర్మాన్నే కాదు శరీర ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. ఉదయం వేళ వేసిన మేకప్ ఇంటికి రాగానే తప్పని సరిగా తొలగిస్తేనే చర్మం బావుంటుంది.

Leave a comment