మిసెస్ ఇండియా ప్రియదర్శిని

సింగపూర్ ఆర్కిడ్ కంట్రీక్లబ్ లో జరిగిన మిసెస్ అందాల పోటీట్లో మిసెస్ ఇండియా ఇంటర్నెషనల్ గా మన దేశం తరుపున ఒరిసా సంబల్ పూర్ కు చెందిన ప్రియదర్శినీ పాండా ఎంపికైంది. ది మోస్ట్ బ్యూటిఫుల్ మదర్ దరాయల్ బ్యూటీ.పోటీల్లో కూడా మొదటిస్థానం దక్కించుకొంది. ఒకే సారి మూడు స్థానాలు దక్కించుకొన్న శ్రీమతిగా పేరు తెచ్చుకుంది ప్రియదర్శిని. స్థానికంగా జరిగే అందాలపోటీల్లో పాల్గొని విజేతగా నిలబడింది. డిగ్రీ పూర్తి చేశాక భువనేశ్వర్ కు చెందిన రతురాజ్ తో పెళ్ళయ్యాక ,ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త సహాకారంతో తన అభిరుచి కొనసాగించింది.ఈ సంవత్సరం ఢిల్లీలో జరిగిన మిసెస్ ఆసియా పసిఫిక్ గా టైటిల్ గెలుచుకొంది. ఇప్పటీ అందాల పోటీల్లో మూడు కీరిటాలు గెలుచుకొని తన ప్రత్యేకను నిరూపించుకొంది ప్రియదర్శిని.