ప్రాచీనమైన ఫిల్మ్ స్టూడియోలో ఒకటైన ఎంజియం లోగో కోసం 1924 లో సింహాలు కెమెరా ముందు నిలబడి యాక్షన్ చేశాయి. గర్జించాయి. మొదట్లో గర్జన శబ్దం లేకుండా సినిమా మొదట్లో లోగో లో వచ్చేది టాకీ సినిమాలు వచ్చాక ఈ సింహం బల్లపైన నిలబడి ఉంటే టెక్నీషియన్స్ హడలిపోయి పారిపోకుండా ఎలా ధైర్యంగా రికార్డ్ చేశారో తెలియదు గాని ఈ సింహం పేరు జాకీ. 30 ఏళ్ళ పాటు వందకు పైగా ఎంజియం వాళ్ళ సినిమాల్లో నటించి 1931 లో రిటైర్ అయి 1935 మరణించింది.ఇలా గర్జన ను రికార్డ్ చేసిన మొదటి సింహం గా జాకీ చరిత్రలో నిలిచిపోయింది.

Leave a comment