మేలు చేసే మెంతులు  

శరీర ఉష్ణోగ్రత ను తగ్గించేందుకు మెంతులు ఎంతో ఉపయోగ పడతాయి .నేరుగా మెంతులు నోట్లో వేసుకొని నీళ్లు తాగవచ్చు . రాత్రి పూట అరచెంచా మెంతులు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే తాగవచ్చు .జలుబు,వళ్ళు నెప్పులకు గోరువెచ్చని నీళ్ళలో మెంతులు వేసి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది .మధుమేహం తగ్గిస్తాయి .కండరాల నెప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది .కొలెస్ట్రాల్ నియంత్రిస్తాయి .పొట్టలో కాస్త తేడాచేసి ఇబ్బంది పెడుతూ ఉంటే మజ్జిగ తో ఒక స్పూన్ మెంతులు తీసుకొంటే వెంటనే తగ్గిపోతుంది .