మేలు చేసే తేనె,వెల్లుల్లి

తేనె ,వెల్లుల్లి కొన్నాళ్ళ పాటు ప్రతిరోజు తీసుకుంటే ఎంతో లాభం అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. కొన్ని వెల్లుల్లిపాయలు చిదిమి వాటిపైన తేనె పోసి సీసాలో పెట్టి ఉంచాలి.వారం రోజుల అలా ఉంచి తర్వాత ప్రతిరోజు దాన్ని తీసుకుంటూ ఉంటే రక్తప్రసరణ మెరుగైపోతుంది.రక్తపోటు అదుపులో ఉంటుందని హానికరమైన కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందని రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుందని చెభుతున్నారు. ఈ రెండిటీ మిశ్రమంతో అంతర్గత అంగాల పనితీరు మెరుగవుతుందంటున్నారు.