తమిళనాడు లో నాగపట్నం కు సమీపంలో మనకు మయూర రూపంలో ప్రత్యక్ష మవుతున్న మయూరనాథుడు.

దక్షయఙ్ఞంలో అవమానం పాలైన పార్వతీ దేవిని దూరదృష్టితో గ్రహించి వీరభద్రుడ్ని పంపిస్తాడు శివుడు.యఙ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు వీరభద్రుడు. ఆ సమయంలో ఈ అలజడికి భయపడి ఒక నెమలి పిల్ల పార్వతి దేవి ఒడి చేరింది.పార్వతి దేవి భర్త వారించిన వినక తండ్రి చేసే దక్షయఙ్ఞానికి వచ్చి అమర్యాదపాలైతినని  అవమానంతో అగ్నికి ఆహుతి అవుతున్న సమయంలో నెమలి కూడా ఆహుతి అవుతుంది.పార్వతి దేవి నిర్మలమైన నెమలి కూడా తనతో తనవు చాలించినది కాన పశ్చాత్తాపంతో తాను నెమలి రూపంలో శివుని ఆలయం సృష్టింపబడి శివారాధన చేసింది.అట్టి మహిమ గల దేవాలయం ఈ మయూరనాథుని ఆలయం.

నిత్య ప్రసాదం: కొబ్బరి, అభిషేకం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment