మహా అయితే తియ్యని మామిడి పండు ఒక్కోటి వంద రూపాయిలు ఉంటే గొప్ప. కానీ లక్షల ఖరీదు చేసే మామిడి పండు చూశారా ?  జపాన్ లోని మియజరి ప్రాంతంలో కాసే ఎగ్ ఆఫ్ ది సన్ గా పిలిచే మామిడి పండ్లు జత నాలుగు లక్షల పైగా ధర పలుకుతుంది .ఇది మాములు మామిడి పండ్ల కన్నా 15 రెట్లు ఎక్కువ తియ్యగా ఉంటాయి .వీటిని పాలి హనుల్లో పెంచుతారు .మామిడి పూత పూయగానే తేనే టీగల సాయంతో పరాగ  సంపర్కం జరుపుతారు .పెద్ద కాయల అవుతాయన్న  పిందెలను ఉంచి మిగతా వాటిని తెంచి పడేసి, పండు పండాక దానంతట అదే రాలే వరకు ఓ నెట్ కట్టి శ్రద్దగా పెంచుతారు .అలా చెట్టు పైనే ఈ పండు పండి రాలి పడుతుందన్న మాట .ఇవే లక్షల రూపాయిల ఖరీదు చేస్తాయి .

Leave a comment