మనస్సుకి నచ్చిన పాత్ర

కొన్ని సార్లు సినిమా షూటింగ్ పూర్తయ్యాక గుడ్ బై చెప్పటం చాలా కష్టం అయిపోతుంది అంటుంది తాప్సీ. అరవై సంవత్సరాల వయసులో షూటర్లుగా పతకాలు సాధించిన ధీర వనితలు కాషీ తోమర్ప్రకాషి తోమర్‌ , చంద్రో తోమర్ జీవితం ఆధారంగా రూపొందించిన ‘సాంద్‌ కీ ఆంఖ్‌’ సినిమాలో తాప్సీ భూమి పడ్నేకర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రీకరణ పూర్తయ్యాక తాప్సీ చాలా బాధపడిందట. ఈ పాత్ర తన మనస్సు కు ఎంతో దగ్గరగా నచ్చిందనీ , నటిస్తున్నంతసేపు ఆ స్ఫూర్తి ఏదో మనసుకి తాకుతుందని ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకం అని చెప్తోంది తాప్సీ.