ఓం సాయి..శ్రీ సాయి….జయ   జయ సాయి..
గురువారం లేదా లక్ష్మి వారం వచ్చిందంటే సాయి నామముతో తెల్లవారుతుంది  కదా!!
సాయి బాబా ప్రత్యక్ష దైవం.మనసులో మాట తలచుకుంటే చాలు ఏదో రూపంలో ప్రత్యక్షమవుతాడు.సాయి దివ్య రూపం, దర్శనం ఒక పుణ్యధామం.సాయి బాబాకి హరతులు,భజనలు అంటే ఎంతో ఇష్టం.మనసులో కోరిక తీరాలంటే ఒక భజన వినిపించిన చాలు ఆ ఆనందమయుడికి.
గురువారం రోజు తప్పకుండా సాయి బాబా చాలీసా పారాయణం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.సాయికి అలంకారం, పల్లకి సేవ చాలా ఇష్టం.
ఇష్టమైన రంగు: కాషాయం.
పువ్వులు: కదంబ మాల.
నిత్య ప్రసాదం: కొబ్బరి, పాయసం, ఉడికించిన శనగలు.
శనగల తయారీ: ముందు రోజు రాత్రి శనగలు  నానబెట్టాలి, పొద్దున్నే కుక్కర్ లో పెట్టి ఉడికించి. బాణాలిలో నూనె వేడి చేసి,ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయల్ని, కర్వేపాకు వేసి, ఉడికించిన శనగలు తగినంత ఉప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
సాయి బాబాకి నైవేద్యం తయారు.
“పరమం పవిత్రం బాబా విభూతిం”…
పరమం విచిత్రం లీలా విభూతిం…
పరమార్ధ మీష్టార్ధ మోక్షప్రదాతం…
బాబా విభూతిం ఇదమాశ్రయామీ!!-  తోలేటి వెంకట శిరీష
.

Leave a comment