పూజ సేతము రారమ్మ….ఈ వేళ లక్ష్మి కి

శ్రీ మహా లక్ష్మి కి..పూజ సేతము రారమ్మా!!
శుక్రవారం ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి, కాళ్ళకి పసుపు రాసుకుని,సింహద్వార గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి మహా లక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆహ్వానించాలి.మనం చక్కగా అలంకరించుకుని దేవిని పూజిస్తే అంతే ఆనందంతో వరాలను ప్రసాదిస్తుంది.
సాయం సంధ్య వేళ వాకిలి తప్పకుండా తీసి పెట్టుకోవాలి, మహా లక్ష్మి దేవి పరిశుభ్రత, సత్ప్రవర్తన కలిగిన వారి ఇంట్లో సకల అష్టైశ్వర్యాలను కలుగ చేస్తుంది.ముత్తైదువుల ఇంటికి వచ్చిన వారికి పసుపు కుంకుమతో,తాంబూలం ఇస్తే చాలా మంచిది.ప్రతి శుక్రవారం లలితా సహస్ర నామము పఠించే వారికి ఆ లక్ష్మి దేవి ఆశీస్సులు ముత్తైదువతనానికి ఎల్లప్పుడూ ఉంటుంది.అమ్మవారికి పచ్చని,ఎర్రని గాజులు అంటే ఎంతో ఇష్టం.
ఇష్టమైన రంగు:ఎర్రుపు,పసుపు, ఆకుపచ్చ.
నలుపు అనివార్యం
పూజకి పువ్వులు: కనకాంబరాలు,మల్లెలు,బొగడ బంతి, చామంతి,జాజి పూలు.
నిత్య ప్రసాదం: కొబ్బరి, అరటిపళ్ళు,సగ్గుబియ్య పాయసం.
పాయసం తయారీ: ముందు రోజు రాత్రి నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పాలను మరిగించి అందులో తీపి కి తగినంత పంచదార వేసి,ఉడికిన సగ్గుబియ్యంను కలపాలి.చివరికి యాలకుపొడి,వేయించిన జీడిపప్పు వేస్తే మహా లక్ష్మి కి మహా నైవేద్యం తయారు!!
రావమ్మ మహాలక్ష్మి…..రావమ్మా…అంటే సరి.- తోలేటి వెంకట శిరీష.

Leave a comment