ఘల్లు ఘల్లున పాద గజ్జెలందెలు మ్రోయ

కలహంస నడకల కలికి!!

సఖులూ పూజ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి కదా!!
అమ్మవారికి ఏడు వారాల నగలు ధరించి నిష్ఠగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసే వనితలంటే చాలా ఇష్టమట.శ్రీ లలిత సహస్ర నామ పారాయణం చేసి ముతైదువులకు తాంబూలం ఇచ్చి నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం లలితా దేవికి ప్రీతీకరం.
నిత్య పూజ కంటే శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.అమ్మవారిని తమ కొంగు బంగారం చేయమని ముడుపులు కడతారు.
ఇష్టమైన రంగు:ఎరుపు,పసుపు,ఆకుపచ్చ
ఇష్టమైన పూజలు:కుంకుమార్చన
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,పాయసం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment