కాలిన గాయపు మచ్చలు చాలా రోజుల వరకు చర్మంలో కలసిపోకుండ కనిపిస్తాయి. ఆయిట్ మెంట్ కంటే గృహ చికిత్సలే వీటికి బాగా పని చేస్తాయి. మెంతుల్ని నానబెట్టి రుబ్బి మచ్చలపై రాస్తూ ఉంటే చాలా తోందరగా తగ్గుతాయి.పెరుగు ,బార్బీపొడిలో నిమ్మరసం కలిపి మచ్చలపై రాసి కాసేపు ఆరనిచ్చి కడిగేయాలి. ఉల్లిపాయరసం కూడా మచ్చలకు బాగా పనిచేస్తుంది. క్యారెట్ గుజ్జు చేసి రాసిన మంచి ఫలితం ఉంటుంది. పసుపు ,తెనే ,గులాబీ నీరు కలిపి మచ్చలపై రాస్తూ ఉంటే కొన్ని వారాలకే మచ్చలు మాయమైపోతాయి.

Leave a comment