మచ్చలు మాయం చేసే దుంప

వేసవి అడుగు పెట్టడం మొదలు పెట్టిన దగ్గర నుండి ఇబ్బంది పేట్టే ఒక సమస్య ముఖం పై నల్లని మచ్చలు, మరకలు రావడం. సూర్యరశ్మి తాకే ముఖం, మెడ ముంచేతులు ఈ సమస్య కు గురైతాయి. శరీరం అధికంగా మెలానిన్ ఉత్పత్తి చేయడం ఇందుకు కారణం. ఎండ ప్రభావం, హార్మోన్లు మార్పు వంటి అంతర్గత కారణాలు వాతావరణ కాలుష్యం హైపర్ పిగ్మేంటేషన్ కు దారి తీస్తాయి. పచ్చి బంగాళదుంపలో ఉండే కాటేక్ కోలేజ్ అనే ఎంజైమ్ ఆధిక మెలనిన్ ఉత్పత్తిని నిరోధించ కలుగుతుంది. శుభ్రంగా కడిగిన బంగాళదుంపను రెండు ముక్కలుగా కోయాలి. లోపలి భాగం చెమ్మగా నీళ్ళు ఉరినట్లు ఉంటుంది. ఆ భాగాన్ని చర్మం పైన పేగ్మేంటేషన్ ఉన్న చోట పది నిమిషాలు రుద్దాలి. పది నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ముఖం చక్కగా అందంగా ఉంటుంది.