లోగో మారింది

పశ్చిమ రైల్వే జోన్ లోని ముంభై లోకల్ ట్రైన్ లపైన ఉన్న మహిళ లోగోను మార్చి ఆధునిక యువతి పెయింటింగ్ ను పెట్టారు. ఈ మేరకు పశ్చిమ రైల్వే మే 27వ తేదీన పెట్టిన ఒక ట్వీట్ లో కాలానుగుణంగా మారే ప్రయత్నంలో బాగంగా మహిళల కోచ్ పైన ఇప్పటి వరకు ఉన్న లోగోను మార్చి ఆధునిక మహిళ బొమ్మను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు స్త్రీలకు విడిగా కేటాయించే సీట్ల దగ్గర కంటర్ లు కంపార్ట్ మెంట్స్ దగ్గర ఓల్డ్ ట్రేడిషన్ లోగో కనిపిస్తుంది. ముంభై లోకల్ ట్రైన్ లపైన ఇక ఫార్మల్ సూట్ లో ఉండే యువతి చిత్రాన్ని చూడచ్చు.