పల్లెటూర్లలో తెలుగు మీడియంలో చదువుకొన్న పిల్లలు కాలేజీ చదువుకు రాగానే ఇంగ్లీష్ కు అలవాటు పడలేకపోతారు. ఇంటి దగ్గరే ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే ఈ ఇబ్బంది వుండదు. రోజుకో పేరా ఇంగ్లీష్ నుంచి తెలుగు లోకి అనువాదం చేయటం మొదలు పెట్టచ్చు. భాషా నేర్చుకోవటానికి గల అనేక మార్గాలలో ఈ అనువాదం మొదటిది. ఇంగ్లిష్ దినపత్రికలు,మ్యాగ్ జైన్లు చదువుతుంటే భాషా నైపుణ్యం పెరుగుతుంది. గ్రామర్ బుక్స్ కూడా చదవటం నెమ్మదిగా కాన్ఫిడెన్స్ పెరిగి ఇంగ్లీష్ అంటే భయం పోతుంది. మాట్లడటం మొదలు పెడితే అలవటువుతుంది ఏ నైపుణ్యాన్నయినా వృద్ధి చేసుకోవాల్సింది మనమే.

Leave a comment