సఖులందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు.మరి ఉసిరి చెట్టుని తెచ్చారా?
ఈ రోజు తులసీ మాత కల్యాణం చెయ్యాలి.
క్షీరసాగర శయనుడు కావున క్షీరాబ్ది ద్వాదశి అని,సురులు-అసురులు క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని,ఉత్థాన ద్వాదశి అని జరుపుకుంటారు.బృందావన ద్వాదశి అని కూడా పిలుస్తారు.
వృంద,జలంధరుడు అనగా తులసి, శ్రీ మహావిష్ణువుల కళ్యాణం చేస్తారు.అందుకే తులసి చెట్టు,ఉసిరి చెట్టుని శ్రీ మహావిష్ణువుగా పూజలు చేసి దీపాలు వెలిగిస్తారు.ఉసిరి కాయతో దీపం వెలిగించిన ముత్తైదువతనానికి ఆశీస్సులు అందుకోవడం విశేషం.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పానకం,వడపప్పు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment