క్షణాల్లో ఆరిపోతుంది

బాత్ రూమ్ దగ్గర డోర్ మ్యాట్ వేస్తారు .తడి కాళ్ళతో లోపల నుంచి బయటకు నడుస్తూ ఉంటారు. అక్కడ ఎండ వేడి పడక , కాళ్ళతో మాటి మాటికీ తడిస్తే డోర్ మ్యాట్ ఆరిపోక తడితడిగా ఉంటుంది. ఆ మ్యాట్ లో చాలా తేలిగ్గా బాక్టిరియా ఫంగస్ చేరుతోంది. వాసన మొదలవుతోంది. ఈ సమస్య కు పరిష్కారంగా వచ్చింది 2 ఫాస్ట్ 2 డ్రై బాత్ మ్యాట్ దీనిపైన తడి కాలు పెట్టగానే లోపల ఉండే మైక్రోమైట్ బార్ కోల్ పదార్థాలు పీల్చేసు కొంటాయి. వెంటనే ఆవిరి రూపంలో గాలి లోపలికి విడుదల అవుతుంది. ఇందులోని యాక్టివేటెడ్ బార్ కొల్ పొర గాలిలో ఉండే హనికర బెంజిన్ ,టోలీన్ జైలిన్ లను తొలగించేందుకు ఉపయోగపడుతోంది. పెద్ద వాళ్ల ఇంట్లో ఇలాంటి మ్యాట్ లు చాలా ఉపయోగం.