పరిణామంలో చూస్తే ఇంత కంటే చిన్న గింజ కనిపించదు. కానీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం కొండంత ఉంది. ఆవగింజలో ,ఆవాల్లో ఉండే ఫోటో న్యూట్రియెంట్ గుణాలు పీచు పదార్థాల కారణంగా అవి జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. ఆవాల్లో సెలీనియమ్ ,మెగ్నిషియం చాలా ఎక్కువ . వాటి యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణం వల్ల మంట నొప్పి తగ్గుతాయి. ఇవి బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. విటమిన్ బీ కాంప్లెక్స్ ఎక్కువ . దీనితో వ్యాధి నిరోధక శక్తి సమకూరటమే కాక జీవక్రియలు సమర్థవంతంగా జరుగుతాయి. ఆవాలలోని కెరోటిన్స్ ,ట్యూబెన్ వంటి పోషకాలు వయసును పెరగటం వల్ల వచ్చే అనర్థాలు తగ్గించి దీర్ఘకాలం యవ్వనంగా ఉంచుతాయి.

Leave a comment