మొబైల్ ఫోన్ శరీరానికి వీలైనంత దూరంగా ఉంచుకొని స్పీకర్ ఆన్ చేసుకొని మాట్లాడండి అంటున్నారు డాక్టర్లు.  అత్యవసర వినియోగం వరకే పరిమితం చేయండి,లేదా వాట్సాప్,మెసేజ్ ల రూపంలోనే ఎక్కువ సమాచారం పంపండి . ఈ ఫోన్ లోంచి వెలువడే రేడియేషన్ మెదడు శరీర భాగాలపై దుష్ప్రభావం చూపెడుతుంది అంటున్నారు . పొద్దున లేచిన దగ్గర నుంచి అలారం తో మొదలు పెట్టి సీరియల్స్ ,సినిమా,పాటలు అన్ని ఫోన్ లోనే అనుకోకండి ,ఇలా అతిగా ఆధారపడితే ఫోన్ అడిక్షన్ కు దారితీస్తుంది . సెల్ ఫోన్ ఛార్జింగ్ తో ఉన్నప్పుడు అస్సలు మాట్లాడవద్దు . అలాగే దేహం లోని మృదువైన కండరాల పై రేడియేషన్ ప్రభావం అధికంగా ఉంటుంది కనుక గుండెకు దగ్గరగా పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని మాట్లాడ వద్దు అంటున్నారు డాక్టర్లు .

Leave a comment