వాతావరణంలోని మార్పులతో జుట్టు పొడిబారిపోవడం సహజం. తరుచు షాంపూతో స్నానం చేయటం వల్ల కూడా జుట్టు పాడైపోతుంది నెలకు ఒకటి రెండు సార్లు కుంకుడుకాయి వాడితే మంచిది అలాగే తలస్నానం కోసం గోరు వెచ్చని నీళ్ళేవాడుకోవాలి. వేడి నీళ్లతో కూడా జుట్టు పొడిబారి పోతుంది. కప్పు కొబ్బరి నూనె లో కొద్దిగా కర్పూరం వేసి మరగనిచ్చి,అది గోరు వెచ్చగా ఉన్నపుడే తలకు పట్టించాలి మాడుకు రక్త ప్రసరణ జరిగి జుట్టు మెరుస్తూ ఉంటుంది.పెరుగులో నిమ్మరసం,గుడ్డు లోని తెల్లసొన, ఆలివ్ నూనె, అరటి పండు గుజ్జు కలిపిన మిశ్రమం తలకు పట్టించి ఓ అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.

Leave a comment