ప్రతి రోజు విధిగా పండ్లు తినటం మంచిదే కానీ ప్రతి రోజు ఒక ఆరెంజ్ తింటే కంటికి మంచిది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఒక తాజా అధ్యయనంలో యాభై ఏళ్ళు దాటితే సహజంగానే కంటి చూపుకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని తప్పని సరిగా ఓ ఆరెంజ్ తినాలి. దీన్ని జ్యూస్ గా కాకుండా యధావిధంగా తినాలి దానిలో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ కంటినీ కంటి చుపునీ రక్షిస్తాయి. పండ్లు కూరగాయల లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నపటికీ ఆరెంజ్ లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి చూపును రక్షించి కంటికి సంబంధించిన సమస్యలు రాకుండ చేస్తాయని చెపుతున్నారు.

Leave a comment