కాలుష్యం తాకని ఉప్పు

సముద్రపు నీళ్ళతో తయారయ్యే ఉప్పు వాడుకుంటాం సరే కానీ 65 కోట్ల సంవత్సరాలు క్రితం హిమాలయాల్లో ఆవిరైపోయిన సరస్సులు ఉప్పు గుహలుగా అవతరించి ఇపుడు ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం సోకని ఉప్పు గా పేరు తెచుకున్నాయి. పాకిస్థాన్ లోని కెర్రా గుహల్లో తవ్వి తీసిన ఉప్పుని హిమాలయ సాల్ట్ అంటారు. ఎలాటి కాలుష్యం సోకని ఈ ఉప్పు ఎరుపు గులాబీ రంగులో దొరుకుతుంది ఎందులో వేస్తే ఆ పదార్థం రుచి పెరుగుతుంది ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.