భారతదేశంలో అతిపెద్దదీ సుందరమైన ప్రకృతి కలిగినది జోగ్ జలపాతం కర్నాటక రాష్ట్రం లోని మల్నాడు ప్రాంతంలోని అతిపెద్ద జలపాతం ఇది . షిమోగా ప్రాంతంలో ఉన్నా ఈ జలపాతం శరావతి నది కొండల పైన నుంచి కిందికి దూకటంలో ఏర్పడింది . 830 అడుగుల ఎత్తు నుంచి రాజా,రాణి,రాకెట్,రోదర్ అనే నాలుగు పాయలుగా కిందకి దూకుతుంది దాని ధ్వని భరించటం చాలా కష్టం . ఆ ధ్వనిని భరించే ధైర్యం అంతటి జలతాన్ని చూడాలన్నా సాహసం ఉంటే నేలను తాకే ప్రాంతానికి వెళ్ళాలి . గాలిలో ఎగిరే నీటి తుంపరలు వాటి లోంచి ప్రయాణం చేసే సూర్య కిరణాలూ ఏర్పరిచే ఇంద్ర ధనుస్సు వెలుగుల్లో జోగ్ జలపాతం అత్యంత సుందరమైన ప్రాంతం .

Leave a comment