ఒకే వయసు వారిలో అయినా కొందరికి జ్ఞాపక శక్తి స్థాయిలు మానసిక నైపుణ్యాలు ఇంకొందరి కంటే దృఢంగా, చురుగ్గా ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే వాళ్ళు చేసే పనులే అంటారు అధ్యయనకారులు . సరైన జీవన విధానం తినే తిండి, అలవాట్లు మెదడుని చైతన్యంతో ఉంచుతాయి అంటారు. వారంలో రోజుకో అరగంట చొప్పున వ్యాయామం గార్డెనింగ్, ఇంటి పనులు, నడక మెట్లెక్కటం  వంటివి చేస్తే మెదడు చురుగ్గా వుంటుంది. పండ్లు కూరగాయలు, పప్పు ధాన్యాలు  తింటూ, ప్రాసెస్డ్,  రెడ్ మీట్ లకు దూరంగా వుంటే వారి జ్ఞాపక శక్తి స్థాయిలు బావుంటాయి. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మెదడును చురుగ్గ ఉంచే మైండ్ గేమ్స్ ఆడితే వస్తాయి. ఆరోగ్యవంతమైన ఆలోచనలతో వుండేవారు ఇతరులతో అర్థవంతమైన బాంధవ్యాలు కలిగి ఉంటారు.

Leave a comment