ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు సారధి హీథర్ నైట్ నేషనల్ హెల్త్ సర్వీసులో సభ్యురాలిగా చేరింది. యూకె లో కరోనా భాదితుల సంఖ్య రోజు రోజూకు పెరుగుతున్న నేపధ్యం లో నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థ మందుల రవాణా వైరస్ ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన కల్పించటం వంటివి చేస్తోంది. కరోనా పై పోరాడాలనే ఆసక్తి ఉన్నవాళ్లు ఇందులో వాలంటీర్స్ గా చేరమని ఈ సంస్థ ఆహ్వానించింది. ఇది చూసిన వెంటనే చేరిపోయింది హీథర్.ఎంతో మంది నా స్నేహితులు ,డాక్టర్లు ఇందులో పనిచేస్తున్నారు. మన కోసం పోరాడే వాళ్ళ కోసం మనం చేయి అందించటం భాద్యత కదా అంటోంది హీథర్ నైట్.

Leave a comment