దుస్తుల ఎంపికలో తెలిసో తెలియకో చేసే పొరపాట్లు ఆకృతినే ప్రభావితం చేస్తాయి అంటారు డిజైనర్స్ .కాస్త బొద్దుగా ఉంటే వదులుగా ఉన్న దుస్తులు వేసుకొంటే ఆ లావు కనిపించదు అనుకొంటారు కానీ వయసు మించి కనిపిస్తారు. వీలైనంత వరకు శరీరానికి సరిగ్గా ఫిట్ గా వుండే డ్రెస్ లే ఎంచుకోవాలి లేదా అంగుళం మించి వదులు లేకుండా చూసుకోవాలి. ఒక్కసారి ట్రాక్ సూట్ కంఫర్ట్ గా అనిపిస్తుంది. కానీ అవి వ్యాయామం కోసం ,దగ్గరగా వుండే దుకాణం వరకు వెళ్ళెందుకే  పనికివస్తాయి . ఎప్పుడైనా కాస్త బరువు పెరిగినట్లు అనిపిస్తే సరిపోయే కొత్త దుస్తులే కొనుకోవాలి ఇరుకుగా అయిపోయిన డ్రస్ లు బావుండవు. జీన్స్ ఎంతకాలం వేసుకొన్న చిరిగిపోవు,కానీ పాతవై పోతాయి. ఆలా ఎదుటివాళ్ళకు తెలిసి పోతాయి. అందుకే ఓ సంవత్సరం వాడేక,పాత రుపు వచ్చాక కొత్తవి కొనుక్కుంటేనే బావుంటుంది. చీరె చక్కగా ఉంటుంది,పలుసార్లు ఉతికాక బ్లవుజు చాలా పాతగా అయిపోతుంది వేంటనే క్రొత్తది కుట్టించుకోవటం మరిచిపోవద్దు.

Leave a comment