ఇంకెంతో గొప్ప అవకాశం 

నేను పింక్ సినిమా చూశాను . నాకెంతో నచ్చింది కానీ ఆ సినిమా తెలుగు వర్షన్ లో నాకు అవకాశం రాగలదని నేను ఊహించనే లేదు. అంత గొప్ప ప్రాజెక్టు లో భాగం కావటం నాకు గొప్ప అవకాశం అంటోంది,మల్లేశం లో నటించిన తార అనన్య నాగళ్ళ. పవన్ కళ్యాణ్ గారితో పనిచేయటం అంటేనే ఎగ్జయిటింగ్ గా ఉంది. అయన నా ఫేవరేట్ యాక్టర్. నటిగా నేను ఎంజాయ్ చేయటం ఇప్పుడు మొదలైంది. మొదట్లో ఎదురుక్కున్నా ఎన్నో తిరస్కారాలను ఎప్పుడు తలచుకొన్న చాలా బాధగా ఉంది. ఇలాటి అవకాశాలే నేను తేరుకొనేలా చేస్తున్నాయి అంటోంది అనన్య నాగళ్ళ.