లంచ్ బాక్స్ లో అనారోగ్యం

పిల్లల లంచ్ బాక్స్ లోనే అసలైన అనారోగ్యం దాక్కొని ఉంటుంది అంటారు పరిశోదకులు . పిల్లలు ఇష్టపడతారని తల్లులు లంచ్ బాక్స్ ల్లో పేస్ట్రీలు,చాకోబార్ లు చిప్స్ లు ఇస్తూ ఉంటారు.ఇదే  98 శాతం అనారోగ్య హేతువులు పిల్లలు తల్లిదండ్రులను విసిగించేది కూడా ఇలాంటి చిరుతిండ్లే కోసమే . వీటిని నిలువ చేసేందుకు వాడే రసాయనాలు ,చక్కని రూపం వచ్చేందుకు వాడే వస్తువులు,పాక్ చేసే బాక్స్ లు అన్నింటా అనారోగ్యమే . చిన్నతనం లోనే టైప్ -2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ పిల్లల్లో జీవక్రియలు క్రమం  తప్పుతాయని తియ్యని వస్తువులు అలవాటైన పిల్లలు ఇంకే పదార్దాన్ని ఇష్ట పడరాని ,పిల్లల ఆరోగ్యం తల్లుల చేతిలోనే ఉంటుందని గుర్తించ మంటున్నారు పరిశోధకులు .