ఇది మంచి అలవాటే

ఒక తాజా అధ్యయనం చాక్లెట్ ,చాక్లెట్ ఆధారిత వస్తువులు వారంలో రెండు సార్లు తీసుకోగలిగితే లేదా అలవాటుగా నెలకు కొన్ని తింటు ఉంటే వాళ్ళలో గుండెపోటుకు కారణం అయ్యే గుండె దడ రాదంటున్నారు . కొందరికి చాక్లెట్స్ ఇచ్చి వారి గుండె పని తీరును రికార్డ్ చేశారు. వారిలో గుండె దడ చాలా తొందరగా తగ్గి పోయినట్లు తేలింది. గుండెనొప్పి లేదా పోటుకు కారణం అయ్యే గుండెదడ వల్ల కొన్ని సార్లు మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది. ఈ విపత్తు నుంచి తప్పించుకొనేందుకు తరుచూ ఒక చాక్లెట్ ముక్క తీసుకోవటం మంచిదే అంటున్నాయి అధ్యయనాలు.