చైనా వారి జంతువు డ్రాగన్ . ఈ డ్రాగన్ పైన వాళ్ళ నమ్మకం అనేకం, డ్రాగన్ బొమ్మలో నృత్యాలు చేస్తారు . ఇళ్ళకు భవనాలకు  డ్రాగన్ ని దిష్టి బొమ్మగా కడతారు . అసలు  డ్రాగన్ బొమ్మ తయారీలో వారే ప్రత్యేకం . ప్రతి సంవత్సరం  డ్రాగన్ పడవ పందాలు నిర్వహిస్తారు . మళ్ళీ ఆ పందాలకు ఎలాటి ఆటంకం కలగ కూడదని ఆ  డ్రాగన్ బొమ్మని ప్రదిస్తారు . ఆ  డ్రాగన్ పతాకం తయారీలో రాగులు ,సజ్జలు వంటి తృణ ధాన్యాలు ఉపయోగిస్తారు ధాన్యాపు కంకులతో చేసే ఈ  డ్రాగన్ బొమ్మను ఆరాధించిన తర్వాత జరిపే పడవ పందాలు కోసం చైనాలో ఆ రోజుని సెలవు దినంగా ప్రకటిస్తారు .

Leave a comment