పూర్తిగా మారిపోతాను 

ఆ పాత్రలాగే మారి పోవాలనుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సైనా నెహ్వాల్ రోజు వారి జీవితం ఎలా వుంటుందో అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనుకొన్న . నేనొస్తున్నానని ప్రత్యేకం ఏర్పాటు చేయద్దని రోజు వారు తినే భోజనాన్ని వండించమని సైనా ఫ్యామిలీని కోరాను అంటూ చెప్పుకొచ్చారు పరిణితి చోప్రా. సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తోంది ఆమె. రెండు గంటల పాటు బాడ్మింటన్ సాధన చేస్తున్నాను. సైనా ను కలిసి ఆమె ఆలోచనలు కోప భావాలు తెలుసుకున్నాను. నేను పూర్తిగా ఆమెలా మారి పోతాను సందేహంలేదు. ఆ క్రీడా కారిణి నిజంగా నాకు స్ఫూర్తి ఇచ్చింది. అంటోంది పరిణితి చోప్రా,ఒక క్రీడా కారిణి అంతరంగంలోకి వెళ్ళిపోవటం ఒక  కళాకారిణికి సాధ్యమే కదా !