పదార్దాలకు ఘాటైన వాసన ఇస్తుంది ఇంగువ . కొన్ని పదార్దాలు ఇంగువ తగలనిదే రుచి కూడా ఉండవు . ఈ ఇంగులో  మంచి వాసనతో పాటు ,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇంగువను క్రమం తప్పకుండా తీసుకొంటే కడుపు ఉబ్బరం గ్యాస్ వంటివి తగ్గుతాయి .శనగ గింజంత ఇంగువ బెల్లంతో కలిపి తీసుకొంటే నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి ఉపశమిస్తుంది . ఇంగువలో యాంటీ వైరల్,యాంటీ బయోటిక్ ,యాంటీ ఇన్ ప్లేమేటరీ గుణాలు ఉంటాయి . కప్పునీళ్ళను మరిగించి దానిలో చిటికెడు ఇంగువ వేసి రెండు మూడు సార్లు తీసుకొంటే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది . మొదటి ముద్దలో నెయ్యి వాము ఇంగువ కలిపి తీసుకొంటే అజీర్ణం సమస్య రావు .

Leave a comment