కన్నీళ్ళకు సాయం 

ఐదేళ్ళ క్రితం రియా శర్మ మేక్ లవ్ నాట్ స్కార్స్ పేరుతొ యాసిడ్ బాధితుల పునరావాస కేంద్ర స్థాపించింది. ఇందులో యాసిడ్ భాదితులకు సర్జరీలు,మందులు ఇతరత్రా చికిత్సలు కు ఖర్చులు ఇస్తారు. న్యాయపోరాటానికి లాయర్లను నియమిస్తారు. విద్య ఉద్యోగాలు పొందేందుకు సాయం చేస్తారు. వాళ్ళకు ఆత్మస్థైర్యం అందించేందుకు యోగ కౌన్సలింగ్ తరగతులు నిర్వహిస్తారు. యాసిడ్ బాధితుల కోసం గాను రియాశర్మ చేసిన సేవలకు యునైటెడ్ నేషన్స్ అవార్డ్ అందుకొంది. యాసిడ్ భాదితులు ఆమెను ఆత్మబంధువులా ప్రేమిస్తారు.