కమాల పండ్ల వాసన ఒత్తిడిని మాయం చేస్తుందని అంటున్నాయి పరిశోధనలు. ఆ వాసన మనసుకి హాయి గొలిపినట్లు పరిశోధనలో వెల్లడైంది. పైగా మానసిక ఒత్తిడి ఉన్నవాళ్ళకు ఈ వాసన మరీ మంచిదని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన నిపుణుల బృందం చెపుతోంది. ఏదైనా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన వాళ్ళు జీవితంలో ఏదో దశలో ఒకలాంటి భయందోళనలకు ఒత్తిడికి డిప్రెషన్ కు లోనవుతారు. ఈ కమలాల నుంచి తీసిన తైలం సువాసన ఎలాంటి ఒత్తిడి నుంచి అయిన ,మనసుకి శాంతి కలిగిస్తూ విముక్తి కలిగిస్తుందని నిపుణులు చెపుతున్నారు. ఈ కమలాల నుంచి తయారు చేసే నూనె సౌందర్య ఉత్పత్తుల్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తారు.

Leave a comment