సాధారణంగా షాపుల పేర్లు ఎన్నో శతాబ్దాలుగా ఫలాన వారి సన్స్ అంటూ కనిపిస్తాయి. ఈ సాంప్రదాయాన్ని తిరిగ రాయించారు లూథియానా కు చెందిన ఒక  వ్యాపారి. ఆయన నిర్వహించే షాపుకు గుప్తా అండ్ డాటర్స్ అన్న బోర్డు రాయించే సరికి అది కాస్త వైరల్ అయింది. మనోజ్ కుమార్ గుప్తా పంజాబీ రాష్ట్రం లూథియానా నగరంలో  కాంట్రాక్టర్ .ఆయన స్థాపించిన చారిటబుల్ ఫార్మసీ ‘ గుర్మికి ‘  యాజమాన్య హక్కులు ఆయన కూతురు  ఆకాంక్ష కు వెళ్లటమే కాక, ఆ షాప్ పైన గుప్తా అండ్ డాటర్స్ గా పేరు రాయించారు  న్యాయశాస్త్రం చదువుతున్న ఆకాంక్ష మా ఇంట్లో ఎప్పుడూ లింగవివక్ష లేదంటుంది.

Leave a comment