Acute coronary Syndrome అనేది NSTEMI and STEMI అని రెండు రకాలు ఉంటుందని చెప్పుకున్నాం. తీవ్రత దృష్ట్యా STEMI అనేది మేజర్ హార్ట్ ఎటాక్ అన్నమాట. ఈ STEMI కే థ్రాంబోలైసిస్ చేయాల్సి ఉంటుంది.

Streptokinase, urokinase వంటి ఇంజెక్షన్లు ఉంటాయి. ఐతే ఇవి జంతువుల సీరం నుంచి తయారు చేసినవి. వీటి ధర 5000- 10000 దాకా ఉండవచ్చు. ఐతే ప్రస్తుతం డీఎన్ఏ రీకాంబినెంట్ టెక్నాలజీ ద్వారా తయారైన Reteplase, tenecteplase ఇంజెక్షన్ లు కూడా వచ్చాయి. ఇవి 40-50వేల వరకు ఎమ్మార్పీ తో ఉంటాయి. Streptokinase వంటి మందులు ఇవ్వటానికి గంట పట్టవచ్చు..వాటిని సెలైన్ లో కలిపి చుక్క చుక్కగా మెల్లిగా ఎక్కిస్తారు. వీటితో పేషెంట్ బీపీ పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అవసరమైతే ఆ గంట సేపు బీపీని పెంచే డోపమైన్ వంటి ఇంజెక్షన్లు కూడా drop by drop ఇవ్వాల్సి రావచ్చు. ఇది అప్పటికప్పుడు డాక్టర్లు పేషంట్ కండీషన్ బట్టి నిర్ణయం తీసుకునే అంశం. Tenecteplase వంటి మందులకు ఇలా drop by drop ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా నరంలోకి ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేయటమే. Reteplase కూడా అంతే, కాకపోతే అది ఇరవై నిమిషాల గ్యాప్ లో రెండు ఇంజెక్షన్లు గా ఇవ్వాల్సి ఉంటుంది.

ఐతే పేషెంట్లు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే…1.ఈ ఇంజెక్షన్లను హార్ట్ ఎటాక్ వచ్చిన 12 గంటలలోపే ఇవ్వాలి. 12-18 గంటల లోపు కూడా ఇవ్వవచ్చు కానీ ఫలితం అంతగా ఉండదు.
2.ఈ థ్రోంబోలైసిస్ వలన మనిషిలో బ్లీడింగ్ రిస్క్ పెరగవచ్చు. అంటే బ్రెయిన్ లో రక్తస్రావం జరగవచ్చు. ఇది దీనికి ఉండేటటువంటి సైడ్ ఎఫెక్ట్. ఐతే డాక్టర్లు ముందే ఆ విషయం చెబుతారు. గతంలో ఎపుడైనా పేషెంట్ కు బ్రెయిన్ లో బ్లీడింగ్ జరిగి ఉంటే ఈ ఇంజెక్షన్ ఇవ్వరు. అలాంటి చరిత్ర లేకుంటే బ్లీడింగ్ జరిగే అవకాశం చాలా తక్కువ. ఐనా risk కంటే benefit ఎక్కువ అని డాక్టర్ అంచనాకు వస్తే మీకు ఆ విషయాన్ని చెబుతారు. నిర్ణయం తీసుకునే బాధ్యత పేషంటు బంధువులదే. బంధువుల నుంచి అంగీకార పత్రం మీద సంతకం అయ్యాకే ఇవ్వటం జరుగుతుంది.

పన్నెండు గంటల లోపు ఇంజెక్షన్ ఇస్తేనే మంచిది కనుక, ఈ నిర్ణయం విషయంలో బంధువులు తాత్సారం చేయటం మంచిది కాదు. ఇవన్నీ అప్పటికప్పుడు తీసుకోవలసిన నిర్ణయాలు.

థ్రాంబోలైసిస్ లేకుండా డైరెక్ట్ గా PCI చేయాలంటే ఆ హాస్పిటల్ లో క్యాథ్ ల్యాబ్ ఉండాలి. PCI ద్వారా డైరెక్ట్ గా గుండె రక్తనాళంలో ఆగిన థ్రాంబస్ ను బయటకు లాగి, వెంటనే అవసరం అనుకుంటే స్టెంట్ వేయటం జరుగుతుంది.

–డాక్టర్.విరివింటి.విరించి(కార్డియాలజిస్ట్)

 

Leave a comment