మంచి సినిమా అరువి

అరువి వంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి క్రితం సంవత్పరం విడుదలైన ఈ సినిమా యూట్యూబ్ లో చూడవచ్చు. తమిళంలో వచ్చిన ఈ సినిమా దర్శకుడు ప్రభుపురుషోత్తమన్ కు ఇదే మొదటి సినిమా .హీరోయిన్ అదితి బాలన్ కు కూడా ఇదే తొలి సినిమా .ఒక కాలేజీకి వెళ్ళే అమ్మాయి రోడ్డుపక్కన పండుకొయించి తింటుంది. పండు కోస్తూ వేలుకోసుకొని ఆ రక్తం ఆ పండుపై కారితే దాన్నీ తుడిచేసి అలా ఇచ్చేస్తాడు షాపు యజమాని. ఆ రక్తం ద్వారా ఆ పాపకు ఏయిడ్స్ వస్తుంది.ఏ తప్పు లేకుండా ఆ అమ్మాయిని కుటుంబం నమ్మకుండా టార్చర్ పెడుతోంది. దాన్నీ భరించలేక బయటికి వస్తే అడుగడుగునా సమాజం వేధిస్తుంది. అనుకోకుండా ఆరువి ఒక టీవీ ఛానల్ రియాల్టీ షో లో కూర్చోవలసి వస్తుంది. ఆ షో ని తన చేతుల్లోకి తీసుకొన్న అరువి తన వేదనని ప్రపంచానికి ఎంత శక్తి వంతగా చెప్పిందో అదే అరువి కథ .రియాల్టీ షోలలో కుటుంబాలను బజారుకు ఈడ్చే ప్రోగ్రామ్స్ వెనక జరిగే తతంగానే ఎంతో చక్కగా చూపించాడో దర్శకుడు. తప్పకుండా ఈ సినిమా చూడండి.