బంగారం అంతా ఇక్కడే

పాస్ పోర్ట్ వీసా ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా . కానీ ఎంత డబ్బున్న ,పదవీ అధికారం ఉన్నా కొన్ని ప్రదేశాల్లో కాలుపెట్టటం అసాధ్యం . అలాంటి వాటిల్లో ఒకటి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ . లండన్ వీధిలో కనిపించే ఈ భవనం కింద మూడు లక్షల చదరపు అడుగుల ఖజానా ఉంది. అందులో బంగారపు కడ్డీల గుట్టలున్నాయి . అవన్నీ కలుపు కొంటే ఐదువేల టన్నుల పైగానే ఉంటుంది . ప్రపంచంలోని బంగారంలో ఐదోవంతు ఇక్కడే ఉంది . ఈ బ్యాంక్ గోడలు దుర్బేధ్యం . బాంబులు వేసిన వణకవు మూడు అడుగుల తాళంచెవితో తెరుచుకొనే బ్రహ్మాండమైన తలుపులు ఉన్నాయి . ఇక్కడికి ఏడాదికి ఒకసారి పర్యాటకులను అనుమతిస్తారు .