గోల్కోండ కోటలో కాకతీయులు నాడు నిర్మించిన జగదాంబ మహాంకాళీ దేవాలయం భారీగా ఉండే బండరాళ్ళ మధ్యని కనిస్తుంది. చూడముచ్చటైన రంగులతో కళ్ళు మిరుమిట్లు గొలిపే ఈ విగ్రహం అత్యంత ప్రాచీనమైన కాళికా దేవాలయంలో కనిపిస్తుంది. రాతిపై చెక్కిన బొమ్మల మధ్య నుంచి సన్నటి మెట్ల మార్గం ద్వారా ఈ మహాంకాళి అమ్మవారి గుడికి రావాలి. పెద్ద బండరాళ్ళ నడుమ ఈ దేవాలయం బయటకు కనిపించదు. గోల్కోండ ముఖ ద్వారం దగ్గర చప్పట్లు కొడితే అది నాలుగు వందల అడుగుల ఎత్తున వినిపిస్తుంది. ఎలాంటి ఆధునికమైన పనిముట్లు భారీ క్రేన్లు లేని ఆ రోజుల్లో ఎంతో కష్టపడి కళాకారులు ఈ శిలా రూపాలు నిర్మించారు.

Leave a comment