కాస్త మూడు బాగాలేదు అనిపిస్తే వేడి నీటి స్నానం చేయమంటున్నారు పరిశోధకులు . దీనివల్ల వెంటనే మూడు మారిపోతుంది . జర్మనీకి చేందిన ప్రేబర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు చెపుతున్నారు . రోజు మొత్తంలో మన శారీరక జీవ రసాయన మార్పులు అలల రూపంలో జరుగుతుంటాయి దీన్నే సిర్నేడియన్ రిథమ్ అంటారు . డిప్రషన్ తో బాధపడే వాళ్ళు ఈ క్రమం దెబ్బతింటుంది . కనుకనే తరచు మూడ్ స్వింగ్స్ వస్తాయి . ఈ రిథమ్ పైన వేడినీళ్ళు సానుకూల ప్రభావం చూపిస్తాయి అంటున్నారు . మధ్యాహ్నం పూట వేడినీళ్ళు స్నానం చేయడం వల్ల శరీర ఉష్టోగ్రత పెరిగి ఆ రిథమ్ నియంత్రణలోకి వస్తుంది . కనీసం అరగంట పాటు ఆ నీళ్ళ కింద స్నానం చేయాలని అధ్యయనకారులు భావిస్తున్నారు . నిద్ర భాగా పడుతుందనీ వ్యాయామంతో పోల్చిన వేడి నీటి స్నానం మెరుగైన ఫలితాలు ఇస్తుందని చెపుతున్నారు .

Leave a comment