కేరళకు చెందిన డిజిటల్ ఫోటోగ్రాఫర్ బినేష్ జీపాల్ మాస్క్ పెట్టుకొన్నా మొహం గుర్తు పట్టే విధంగా కొత్త రకం మాస్కలు తయారు చేశాడు . డిజిటల్ ఫోటో గ్రఫీ లో తనకు ఉన్నా అనుభవంతో ఎదురుగా ఉన్న వ్యక్తి ఫోటో తీసి ,ఇమేజ్ పెంచి ప్రత్యేకమైన పేపర్ పైన ప్రింట్ తీసి మాస్క్ పెట్టుకొన్నప్పుడు కనబడేంత భాగాన్ని కట్ చేసి మిగతా ముక్కని అధిక ఉష్ణోగ్రత వద్ద క్లాత్ మాస్క్ పైన ప్రింట్ చేశాడు . దవడ  భాగం ముందే కొలత తీసుకోని ముఖ భాగానికి ఖచ్చితమైన కొలతలు వచ్చేలా ఫోటో లు తీస్తాడు .మొత్తం మాస్క్ వేసి ఇచ్చేందుకు 20 నిముషాలు పడుతోంది .ముఖం ప్రింట్ తీసిన మాస్క్ ఖరీదు 60 రూపాయిలు .ఈ ఐడియా అందరికి నచ్చింది .ఎవరి మొహం వాళ్ళు ఫోటో తీయించు కొని మాస్కు తయారు చేయించు కొంటున్నారు . బినేష్ కు కుప్పలు తెప్పలు ఆర్డర్ లు వస్తున్నాయి .

Leave a comment