ప్రతి రోజు కాస్తో కుస్తో అలంకరణ తప్పకుండా వేసుకుంటారు కానీ మేకప్ పూర్తిగా తోలగించుకోకపోతే అలంకరణ తాలుకా రసాయనాల అవశేషాలు ఉండిపోయి మొటిమలు ఇతర సమస్యలు తలెత్తుతాయి.సాధరణంగా వాడే క్లెన్సింగ్ లోనూ ఎంతో కాంతి రసాయనాలు ఉంటాయి.ఆలీవ్ నూనెతో ముంచిన దూదితో మొహం మెడ తుడిస్తే మలినాలు పోతాయి. కీరదోస కూడ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. కీరదోస రసం బాదం నూనె కలిపి మెడ,ముఖానికి రాసి కాసేపాగి కడిగేయాలి.ఇలా మలినాలు తొలగించుకుని ముఖం శుభ్రంగా కడుక్కుని మాయశ్చరైజర్ రాసుకుంటే ముఖం మరునాటికి తాజాగా కనిపిస్తుంది.

Leave a comment